అఖండ 2 షూటింగ్ అప్డేట్

Akhanda 2 poster

నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసి అలరించిన చిత్రం అఖండ. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా, శ్రీకాంత్ విలన్ పాత్రని పోషించారు. ఈ సినిమా 2021 సంవత్సరంలో డిసెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

ఈ సినిమాలో బాలకృష్ణ ఒక రైతుగా, మరియు అఘోరగా నటించి ప్రేక్షకులని అలరించారు. అఘోరగా బాలకృష్ణ చేసిన నటనకు మంచి ప్రశంశలు లభించాయి. ఈ సినిమా సాధించిన అఖండ విజయం తర్వాత చిత్రబృందం ఈ సినిమాకి సీక్వెల్ ని తీయాలని నిర్ణయించుకున్నారు.

ఈ సీక్వెల్ సినిమాని బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాకి అఖండ 2: తాండవం అనే పేరుని ఖరారు చేసారు. ఈ సినిమా పూజ కార్యక్రమాలని డిసెంబర్ 11, 2025 న జరుపుకోగా, తేజస్విని నందమూరి ముహూర్తం షాట్ కొట్టి సినిమాని ప్రారంభించారు. పూజ కార్యక్రమం రోజునే సినిమాని సెప్టెంబర్ 25, 2025 న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తామని ప్రకటించారు.

తాజాగా చిత్రబృందం ఈ సినిమా షూటింగ్ ని ప్రయాగ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో తీయాలని నిర్ణయింత్చుకున్నట్లు ప్రకటన విడుదల చేసారు. మహా కుంభ మేళా కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు లక్షలాదిగా వస్తారు. అక్కడ కుంభ మేళాలో కొన్ని సీన్స్ తో శుభసూచకంగా ప్రారంభిస్తున్నారని తెలుస్తుంది.

ఇలా కుంభ మేళాలో సినిమా తీయడం ఇదేమి మొదటిసారి కాదు, ఇంతకు ముందు జూనియర్ ఎంటీఆర్ నటించిన శక్తి సినిమాలోని కొన్ని సన్నివేసాలని దర్శకుడు మెహర్ రమేష్ కుంభ మేళాలో చిత్రీకరించారు.

బాలకృష్ణ కూతురు నందమూరి తేజస్విని ప్రత్యేక శ్రద్దతో నిర్మిస్తున్న ఈ అఖండ2 చిత్రం కూడా అఖండ స్థాయిలో విజయం సాధిస్తుందో లేదో అని వేచి చూడాలి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *