అల్లరి నరేష్ మళ్ళీ కామెడీ సినిమాలు ఎప్పుడు చేస్తారంటే?
హీరో అల్లరి నరేష్ మంచి కామెడీ టైమింగ్ ఉన్న తెలుగు నటుల్లో ఒకరు. ఆయన సినిమాలంటే హాయిగా నవ్వుకోవచ్చు అనేలా ఉండేవి. అయితే ఆయన కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని వరుసగా సీరియస్ సినిమాలు తీసారు. ఇప్పుడు మళ్ళీ 12A రైల్వే స్టేషన్ అనే సీరియస్ థ్రిల్లర్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకి సంబదించిన ట్రైలర్ని చిత్రబృందం నిన్ననే విడుదల చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మళ్ళీ కామెడీ సినిమాలు ఎప్పుడు చేస్తారనే విషయం చెప్పారు.
12A రైల్వే స్టేషన్ కార్యక్రమంలో రఘు అనే ఒక పాత్రికేయుడు వరుసగా సీరియస్ సినిమాలు తీస్తున్నారు మళ్ళీ ఒక కామెడీ సినిమా ఎప్పుడు తీస్తారని అల్లరి నరేష్ ని అడగగా, అల్లరి నరేష్ స్పందిస్తూ ఒకప్పుడూ మీరే వరుసగా కామెడీ సినిమాలు తీస్తున్నారు, సీరియస్ సినిమాలు ఎప్పుడు తీస్తారు అని అడిగారు? ఇప్పుడు కామెడీ సినిమా ఎప్పుడు తీస్తారు అని అడుగుతున్నారు అని సమాధానమిస్తూ, త్వరలోనే ఒక కామెడీ సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమా తర్వాత రాబోయే సినిమా అల్కహాల్ సీరియస్ సినిమా. ఆ సినిమా తర్వాత తీయబోయే రెండు సినిమాలు కూడా సినిమాలే అని అల్లరి నరేష్ సమాధానం చెప్పారు. అంటే ప్రేక్షకులు మళ్ళీ గాలి శ్రీను, బెండు అప్పారావు లాంటి కామెడీ పాత్రల్లో అల్లరి నరేష్ ని చూడబోతున్నారు అన్నమాట.
12A రైల్వే స్టేషన్ సినిమాలో అల్లరి నరేష్ తో పాటు కామాక్షి భాస్కర్ల నటిస్తున్నారు. ఈ థ్రిల్లర్ సినిమాకి మా ఊరి పొలిమేర, మా ఊరి పొలిమేర 2 సినిమాల దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ వహించారు. భీంస్ సిసిలిరియో ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.ఈ సినిమా నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది
Follow us on Whatsapp: https://whatsapp.com/channel/0029VaoM4BzEgGfRA8x7Pb2A
