నో హెల్మెట్, నో ఎంట్రీ
నో హెల్మెట్, నో ఎంట్రీ విజయవాడ ప్రకాశం బ్యారేజీపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి, వీటిలో ఎక్కువ శాతం ప్రమాదాలు ద్విచక్ర వాహనదారులకే జరుగుతున్నాయి. అందువలన ఈ ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు ఇకపై ద్విచక్రవాహన దారులందరూ హెల్మెట్ ధరిస్తేనే ప్రకాశం బ్యారేజీపైకి అనుమతిస్తామని చెప్పారు. ప్రమాదాలు నివారించేందుకు ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. ఈ రూల్ ఈరోజు నుంచే అమలులోకి వస్తుంది.