మాస్ జాతర తర్వాత రూటు మార్చిన రవితేజ?
హీరో రవితేజ కి ధమాకా సినిమా తర్వాత ఏ సినిమా ఆశించిన మేర విజయం సాధించలేదు. తన చివరి సినిమా మాస్ జాతర కూడా ప్రేక్షకులని అలరించలేకపోయింది. రవితేజ ఇలాగే ఉంటే కష్టం, రూటు మార్చాలనే విమర్శలు వెల్లువెత్తాయి. సినిమా ప్రేక్షకుల నుంచే కాకుండా తన అభిమానుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి.
ఈ విమర్శలన్నీ రాకముందే రవితేజ తర్వాత సినిమాలు చూస్తుంటే మాస్ జాతర సినిమాతో తన మూసధోరణికి స్వస్తి చెప్పాలనుకున్నారని తెలుస్తుంది. రవితేజ నుంచి తర్వాత రాబోయే సినిమా భర్త మహాశయులకి విజ్ణప్తి ఒక కుటుంబ కథా చిత్రమని తెలుస్తుంది. అలాగే ఇటీవలే యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టితో ఒక మల్టిస్టారర్ కథ సిద్ధంగా ఉందని, రవితేజ కూడా ఒకే చెప్పారనే కథనాలు వినిపించాయి. వీటన్నికంటే ముందు మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ సినిమాలతొ వరుస విజయాలు సాధించిన కల్యాణ్ శంకర్ కూడా రవితేజకి ఒక సూపర్ హీరో కథ చెప్పినట్లు, దానికి రవితేజ కూదా ఓకే చెప్పినట్లు, సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా నిర్మిస్తున్నత్లు కథనాలు వచ్చాయి.
వీటన్నింటిని ఒకే చేస్తే మాస్ జాతర సినిమానే రవితేజ చేసిన చివరి రెగ్యులర్ కమర్షియల్ సినిమా అవుతుంది. ఈ వార్తలు నిజమయితే రవితేజ నుంచి కొత్తదనం కోరుకుంటున్న ప్రేక్షకులకి, అభిమానులకి సంతోషమే. చూద్దాం, మరి రవితేజ మనసులో ఏముందో, ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో.

Fantastic article! So glad I found this.