ఓటీటీల విషయంలో బాలీవుడ్ ని ఫాలో అవుతున్న టాలీవుడ్?

Major OTT platforms

ఈ మధ్య విడుదలైన చాలా సినిమాలు థియేటర్లలో ఆడకపోవడానికి కారణం ఓటీటీ కల్చర్ పెరిగిపోవడం అని చాలా మంది దర్శకులు నిర్మాతలు వాపోతున్నారు. నెల రోజులు తిరగకుండానే ఇంట్లో చూసే అవకాశం ఉన్నప్పుడు థియేటర్లకి వెళ్ళడం దేనికి అని జనాలు కూడా అనుకుంటున్నారు.

ఓటీటీ ప్లాట్ ఫారంస్ కూడా డిజిటల్ రైట్స్ ఎక్కువ మొత్తంలో ఇచ్చి కొనుక్కోవడంతో పెద్ద సినిమా నిర్మాతలు కూడా ఈ విషయంపై మౌనంగానే ఉంటున్నారు. అయితే బాలీవుడ్ వాళ్ళు ఈ సమస్యని పరిష్కరించేందుకు ఒక నియమం పెట్టారు. థియేటర్లో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే సినిమా ఓటీటీ లో విడుదల చేయాలి అని.

ఇప్పుడు జనాలని థియేటర్లకి రప్పించేందుకు మన దగ్గర కూడా ఈ ఎనిమిది వారాల నియమం తీసుకురావాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఒకప్పటిలా ఒటీటీ సంస్థలు డిజిటల్ రైట్స్ కి నిర్మాతలు అడిగినంత ఇవ్వటానికి సుముఖత చూపించడం లేదు. హీరో లేదా నిర్మాణ సంస్థ పాత సినిమాల పర్ఫార్మెన్స్ ని బట్టే ఒక బేస్ ప్రైస్ పెట్టి, ఆ తర్వాత థియేటర్లో సినిమా రన్ ని బట్టి, చెప్పిన డేట్ కే విడుదల చేస్తే, ఆ బేస్ ప్రైస్ మీద ఇంకొంచెం కలిపి ఇస్తామని ఓటీటీ సంస్థలు అంటున్నాయి.

ఒకప్పటిలా అడిగినంత ఇవ్వడం లేదు కాబట్టే ఇప్పుడు ఓటీటీ సంస్థల ముందు ఈ ఎనిమిది వారాల గ్యాప్ ఆలోచనని ముందుంచే అవకాశం బలంగా ఉంది. కనీసం ఇలా అయినా మంచి టాక్ వచ్చిన సినిమాలని చూడటానికి జనాలు థియేటర్లకి వస్తారని సినీ పెద్దలు ఆశిస్తున్నారు. అయితే, ఈ నిర్ణయానికి ఓటీటీ సంస్థలు ఏ మాత్రం సుముఖత చూపిస్తాయో చూడాలి.

Spread the love

Leave a Reply