చిరంజీవి నుంచి రాజకీయం దూరం కాలేదా?
మెగాస్టార్ చిరంజీవి అనే పేరు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక ఘనత. అలాంటి వ్యక్తి రాజకీయం నుంచి దూరంగా ఉంటున్నా రాజకీయం మాత్రం తన నుంచి దూరం కాలేదు అనే చెప్పచ్చు. ఈ మధ్య కాలంలో భారత రాజకీయ పార్టీలు,పార్టీ నాయకులు చిరంజీవి యొక్క ప్రస్తావన లేకుండా వాళ్ళ సభలు పూర్తి కావట్లేదు అని చెప్పచ్చు.
ఈరోజు చిలుకూరులోని ఎక్స్పీరియం పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిరంజీవి తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అక్కడ కూడా ముఖ్యమంత్రి, మంత్రులు చిరంజీవిని నటుడు కంటే మన అభిమాన నాయకుడు, మాజీ కేంద్రమంత్రి అనే ఎక్కువమంది సంభోందించారు. దీన్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చిరంజీవి దూరంగా ఉన్నా, చిరంజీవిని దూరం చేసుకునే ఉద్దేశ్యం కాంగ్రెస్ పార్టీ నాయకులకి లేదనిపిస్తుంది.
భారతీయ జనతా పార్టీ కూడా చిరంజీవితో సన్నిహితంగానే ఉంటుంది. ఇటీవలే ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి, తెలంగాణా నాయకులు కిషన్ రెడ్డి గారు తన ఇంట్లో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకలకు కూడా చిరంజీవిని ఆహ్వానించగా ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నరేంద్ర మోదీ ముఖ్య అథిధిగా హాజరయ్యారు.
చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనే సంగతి అందరికి తెలిసిందే కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం చిరంజీవి మాత్రమే ఉంటున్నాడు. ఇది దేనికి సంకేతం?? కేంద్ర నుంచి చిరంజీవికి ఏమైనా పదవి దక్కనుందా??