వల్లభనేని వంశీ అరెస్ట్ పై ఎన్ టీ ఆర్ స్పందిస్తాడా?

వైసిపీ నేత వల్లభనేని వంశీని మంగళగిరి తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈరోజు హైదరాబాద్ మై హోం భుజ అపార్టెమెంట్లో అరెస్ట్ చేసి విజయవాడకి తరలించారు. అల్లర్లు జరిగే అవకాశం ఉన్నందున కృష్ణా జిల్లాలో 144 సెక్షన్ కూడా విధించారు.
వల్లభనేని వంశీ మోహన్ మొదట్లో తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు, ఆ రోజుల్లో పరిటాల రవికి సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో ఆయన కూడా ఒకడు. అదుర్స్, టచ్ చేసి చూడు సినిమాలకి నిర్మాతగా వ్యవహరించిన వల్లభనేని వంశీ హీరో ఎన్ టీ ఆర్ తో సన్నిహితంగా మెలిగేవాడు. అయితే వైసిపీ పార్టీలో చేరిన తర్వాత అతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు కుమారుడు, ప్రస్తుత మంత్రి అయిన నారా లోకేష్ మీద చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి.
వల్లభనేని వంశీ మొహన్ గన్నవరం నియోజకవర్గం నుండి మూడు సార్లు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత వైసిపీ పార్టీలో చేరాడు. వైసిపీ అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరి తెలుగుదేశం కార్యాలయంపై దాడి జరిగింది. వంశీ అనుచరులు కార్యాలయంపై దాడి చేసి తగలబెట్టారు. ఈ విషయంపై తెలుగుదేశం కేసు పెట్టినా అప్పట్లో ఆ కేసులో సరైన పురోగతి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కేసులో వేగం పెరిగింది, కేసుకి సంబంధించిన వారి అరెస్టులు కూడా జరిగాయి.
2024 ఎన్నికల్లో జరిగిన ఘోర ఓటమి తర్వాత ఆయన రాజకీయాల్లో పెద్దగా కనిపించలేదు. ఈ కేసులో అరెస్ట్ తప్పించుకోడానికి కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసాడు, ఆ పిటిషన్ ని కోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మధ్యలో పోలీసులు వంశీని హైదరాబాద్, రాయదుర్గంలో మై హోం భుజా అపార్టెంట్లో ఉంటున్నారని తెలుసుకుని అరెస్ట్ చేసి విజయవాడకి తరలించారు.
ఎన్ టీ ఆర్ కి వల్లభనేని వంశీతో దగ్గర సంబంధాలు ఉన్నాయి, నారా లోకేష్ గురించి అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన సందర్భంలో స్పందించినప్పుడు కూడా ఎన్ టీఆర్ వంశీ గురించి నేరుగా స్పందించలేదు.వంశీ, నాని లు కూడా ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ పగ్గాలు చంద్రబాబు తర్వాత ఎవరు చేబడతారనే విషయం వచ్చినప్పుడు ఎన్ టీ ఆరే చేపట్టాలని అనేవారు. మరి ఇప్పుడు ఎన్ టీ ఆర్ ఈ అరెస్ట్ పై ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.