K Ramp – కిరణ్ అబ్బవరం కొత్త సినిమా విశేషాలు

‘క ‘ సినిమా విజయంతో జోష్ మీదున్న యువ హీరో కిరణ్ అబ్బవరం ఈరోజు మరో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు. హాస్య మూవీస్ బ్యానర్ పై నిర్మాత రాజేష్ దండు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జైన్స్ నాని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా కొత్త నటి యుక్తి తరేజా ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం కాబోతుంది.
ఈ సినిమా “కె ర్యాంప్”, కేరళ ర్యాంప్ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పూజ కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్ లో జరిపారు. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకి క్లాప్ కొట్టగా, నిర్మాత అనిల్ సుంకర కెమెరా స్విచ్ ఆన్ చేసారు. యువ దర్శకులు విజయ్ కనకమేడల, బెజవాడ కుమర్, రాం అబ్బరాజు, మరియు యదు వంశీలు సినిమా స్క్రిఫ్ట్ ని దర్సకుడు నానికి అందజేశారు. దర్శకుడు యోగేష్ మొదటి సినిమాకి దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో హీరో కిరన్ అబ్బవరం ఫుట్బాల్ ప్లయర్ గా నటిస్తున్నాడని సమాచారం. కేరళ నేపధ్యంలో సాగే ఒక ఫ్యామిలీ రొమాంటిక్ చిత్రం గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కిరణ్ అబ్బవరం, ఈ నెలలో దిల్ రూబ అనే ప్రేమ కథా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాని ఫిబ్రవరి 14న విడుదల చేస్తామని ప్రకటించినా, కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరి 21కి వాయిదా వేయడమైనది.