హరిహరవీరమల్లు నుంచి నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడంటే?

హరిహరవీరమల్లు పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ కలిసి క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణల దర్శకత్వంలో వస్తున్న చిత్రం. ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి మొదటి పాట మాట వినాలి ఈ మధ్యే విడుదల అయ్యింది. ఈ పాటని తెలుగులో పవన్ కల్యాణ్ పాడారు. పాటకి మంచి స్పందన వచ్చింది, ఈరోజు పవన్ కల్యాణ్ పాట పాడిన సన్నివేశాలతో పాటు సినిమా చిత్రీకరణకు సంబంధించిన కొన్ని సన్నివేశాలని ఈరోజు మాట వినాలి మేకింగ్ వీడియో రూపంలో కలిపి విడుదల చేశారు.
ఈరోజు విడుదలైన మేకింగ్ వీడియోలో పవన్ కల్యాణ్ లుక్స్ అభిమానుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే ఈ చిత్రం నుంచి నెక్స్ట్ అప్డేట్ ఏమిటనే విషయానికొస్తే, చిత్రం నుంచి రెండో పాటను చిత్రబృందం విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈ రెండవ పాట ఫిబ్రవరి నెల 2వ వారంలో విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యాంకర్ అనసూయ, పూజిత పొన్నాడ ఉన్న వేడుక నేపథ్యంలో వచ్చే పాట అని అంటున్నారు.
ఈ సినిమాని మార్చి నెలలో విడుదల చేస్తామని ముందు ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో విడుదలయ్యేలా ఉంది. ఇంకా పవన్ కల్యాణ్ కి సంబంధించిన కొన్ని రోజుల షూతింగ్, విఎఫ్ఫెక్స్ పనులు పూర్తి కావాల్సి ఉన్నాయి కాబట్టి ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
నిర్మాత ఎ ఎం రత్నం అయితే ఈ సినిమా దక్షిణ భారతంలో కంటే ఉత్తర భారతంలో బాగా ఆడుతుందని గట్టి విశ్వాసంతో ఉన్నారు. మరి ఈ సినిమా ఉత్తరాది ప్రజలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యేంతవరకు వేచి చూడాలి.