అభిమానులకి తారక్ సందేశం
తారక్ దేవర సినిమా తర్వాత బాలీవుడ్ సినిమా వార్ 2 చిత్రీకరణలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నారు. అయితే ఈరోజు తారక్ టీం తారక్ అభిమానులని ఉద్దేశించి ఒక సందేశాన్ని విడుదల చేసారు.
ఆ సందేశంలో “మీరు చూపిస్తున్న ప్రేమకి అభిమానానికి ధన్యవాదములు. తనని కలవాలనే అభిమానుల ఉత్సాహాన్ని ఆయన అర్థం చేసుకుని మీ అందర్నీ ఆయనే త్వరలోనే స్వయంగా కలవాలనుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా, అన్ని రకాల అనుమతులు తీసుకుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతవరకూ కొంత సమయం పడుతుంది, ఈ మధ్యలో దయచేసి అభిమానులెవ్వరూ తనని కలిసేందుకు పాదయాత్ర లాంటివి చేసి ఇబ్బంది పడొద్దు, మీ అందరు బాగుండటం ఆయనకి ఎంతో ముఖ్యం” అని ఉంది.
ఈ మధ్య అభిమానులు తమ అభిమాన హీరోలని కలిసేందుకు ఇలా పాదయాత్రలా వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. అలా తన అభిమానులు ఎవరూ ఇబ్బందై పడద్కూడదని తనే స్వయంగా అందరిని కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని, అంతవరకూ సమన్వయం పాటించాలని సారాంశం.