Akhanda 2 shooting update

దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ రైతుగా, అఘోరాగా ద్విపాత్రాభినయం చేసి అలరించిన సినిమా అఖండ. ఈ సినిమా 2021 లో థియేటర్లలొ విడుదలై అఖండ విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా అఖండ 2 ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్వి స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
చిత్రబృందం ఇటీవలే తమ సినిమాలో సమ్యుక్త మీనన్ ను తమ సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ని శుభప్రదంగా ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభ మేళాలోని దృశ్యాలని చిత్రీకరించడంతో ప్రారంభించారు. అక్కడ సాధువులకి సంబంధించిన కొన్ని దృశ్యాలు చిత్రీకరించారు. కొన్ని రోజుల తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను సినిమా షూటింగ్ కి అవసరమైన ప్రదేశాల కోసం వెతుకుతూ కృష్ణా జిల్లాలోస్ సందడి చేసారు.
ఇప్పుడు ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరాగా కనిపించే ఎంట్రీ సీన్ చిత్రీకరణకు బృందం సన్నద్ధమవుతుంది. ఈ సీన్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ సెట్ వేస్తున్నారు. ఫిబ్రవరి రెండవ వారం నుంచి ఈ సెట్లో చిత్రీకరించే అవకాశముంది.
ఇప్పటికే పూజా కార్యక్రమం రోజునే చిత్రబృందం సెప్టెంబరు 25ని తమ చిత్ర విడుదల తేదీగా ప్రకటించారు. ఆ రోజున సినిమాని విడుదల చేసే విధంగా చిత్రీకరణ పూర్తి చేయాలనే ధృడ నిశ్చయంతో చిత్రబృందం పనిచేస్తుంది.