చిరంజీవి బాబీ సినిమా పూజ ముహుర్తం ఖరారు

Chiru Bobby Pooja Announcement poster

చిరంజీవి ఈ సంవత్సరం సంక్రాంతికి మన శంకర్ వర ప్రసాద్ గారుతో వచ్చి బాక్సాఫీస్ రికార్డులని కొల్లగొడుతున్నాడు. ఈ సినిమా తర్వాత చిరంజీవి బాబీ కొల్లి దర్శకత్వంలో ఒక సినిమా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే మన శంకర్ వర ప్రసాద్ గారి తర్వాత వెంటనే మొదలు పెట్టే సినిమా బాబీ దర్శకత్వం చేస్తున్న సినిమా. ఈ సినిమాని షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు పెట్టబోతున్నారని సమాచారం. అయితే ఈ సినిమా గురించి అధికారక ప్రకటన పోయిన ఏడాది చిరంజీవి పుట్టిన రోజున చేసారు.

మాకున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన పూజ ముహుర్తూం ఈ నెల 25న హైదరాబాద్ లో చేయాలని అనుకుంటున్నారు. ఇది ఒక గ్యాంగ్స్టర్ సినిమా అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం, ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర మొహన్ లాల్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో అనురాగ్ కాశ్యప్ విల్లన్ పాత్ర చేస్తున్నారని సమాచారం.

ఈ సినిమాని కె వి ఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మొదట్లో థమన్ సంగీత దర్శకుడు అని అనుకున్నారు, అయితే తాజా కథనాల ప్రకారం అనిరుధ్ ని తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే దీని గురించి ఎటువంటి అధికారక ప్రకటన చేయలేదు. ఈ పూజా ముహుర్తం రోజున నటీనటులు, సంగీత దర్శకుడి గురించిన అధికారకంగా ప్రకటించే అవకాశం ఉంది.

Spread the love

Leave a Reply