రెండు పార్ట్ లు గా మరో ఎన్టీఆర్ సినిమా
జూనియర్ ఎన్టీఆర్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం డ్రాగన్, అధికారకంగా ప్రకటించకపోయినా అందరూ ఈ పేరునే వాడుతున్నారు. ఈ సినిమా ఈ మధ్యనే హీరో దర్శకునికి మధ్య కథా కథనం విషయంలో విభేదాలు వచ్చి షూటింగ్ కొంతకాలం ఆగిపోయినట్లు వార్తలు వినిపించాయి. ఇప్పటి వరకు చిత్రీకరించిన సన్నివేశాలు కూడా మళ్ళీ చిత్రీకరిస్తారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే వాటి గురించి సినిమా బృందం స్పందించకుండా, తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. అయితే ఇప్పటి వరకు చిత్రీకరించిన సన్నివేశాల్లో కేవలం కొన్ని సన్నివేశాలని మాత్రమే మళ్ళీ చిత్రీకరించబోతున్నారని తెలిసింది. త్వరలోనే యూరప్ లో కొత్త షెడ్యూల్ కూడా ప్రారాంభం కాబోతున్నట్లు సమాచారం.
అయితే తాజాగా నెట్టింట్లో ఈ సినిమాకి సంబంధించి ఒక కొత్త వార్త చక్కర్లు కొడుతుంది. ఏమిటంటే ఈ సినిమాని నిర్మాతలు రెండు పార్టులుగా విడుదల చేయాలనే అలోచనలోనే ఉన్నారని. తాజా కథనాల ప్రకారం ఈ సినిమా మొత్తం నిడివి 3 గంటల 40 నిమిషాలు అవుతుందని, దానిని ఒకే సినిమాలా చూపించడం కన్నా, ఒకే సారి మొత్తం చిత్రీకరణ పూర్తి చేసి నెలల గ్యాప్ లో రెండు సినిమాలుగా విడుదల చేయాలని అనుకుంటున్నారని సమాచారం.
ఇప్పటికే ఎంటీఆర్ దేవర సినిమాని రెండు పార్ట్ ల సినిమాగా ప్రకటించి, పార్ట్ 1 విడుదల చేసారు. పార్ట్ 2 చిత్రీకరణ ఎప్పుడు మొదలవ్వుతుందనే సమాచారం అయితే ప్రస్తుతానికి లేదు, దర్శకుడు కొరటాల శివ కూడా కొత్త యువ కథానాయకులకి కథలు చెప్పి జూనియర్ ఎంటీఆర్ తన సినిమాలు పూర్తి చేసుకొచ్చెలోపు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక సినిమా చేసే పనిలో పడ్డారు. అయితే దేవర లా పార్ట్ 2 కోసం అభిమానులు ఏళ్ళ తరబడి ఎదురు చూడకుండా డ్రాగన్ సినిమాని నెలల సమయంలోనే రెండు పార్టులు విడుదల చేయాలని అనుకోవడం మంచి పరిణామంగానే భావించాలి.
ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్నారు, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి రవి బస్రుర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
