సినిమా టికెట్ ధరల పెంపుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించిన పవన్ కల్యాణ్ గారికి సినిమా టికెట్ రేట్లు ఒక సినిమాపై ఎంత ప్రభావం చూపిస్తుందో భీంలా నాయక్ సినిమాకి వైయస్సార్సిపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం వ్యవహరించిన తీరు వలన ఆయనకి వ్యక్తిగతంగా బాగా తెలుసు. అలాంటి భాధలు సినీపరిశ్రమలోని నిర్మాతలకు ఉండకూడదని ఆ సమయంలో బలంగా గొంతెత్తారు కూడా. ఆయన అధికారంలోకి వచ్చాక ఆ కష్టాలు సినీపరిశ్రమ వాళ్ళకి ఉండకూడదని, నిర్మాతలకు సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వం తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.
ఎండీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విడుదలైన కల్కి, దేవర, పుష్ప 2 లాంటి సినిమాలకు ఆంధ్రాలో సినిమా టికెట్లు మంచి రేట్లకి అమ్ముకునేలా ప్రభుత్వం అనుమతినిచ్చింది. పుష్ప 2 సినిమాకి అయితెనే అన్ని సినిమాల కనా ఎక్కువ రేట్లకి అమ్ముకునేలా అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాతలందరూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారిని కలిసినప్పుడు ఆయన తికెట్ ధరల గురించి ఏమన్నారో బన్నీ వాస్ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నిర్మాతలు పవన్ కల్యాణ్ గారిని కలిసినప్పుడు ప్రతిసారీ ఇలా ప్రభుత్వం దగ్గరికి రాకుండా టికెట్ ధరల కోసం మీరందరూ కూర్చుని ఒక కమీషన్ లాంటిది ఏర్పాటు చేసుకుని ఒక ప్రతిపాదనతో రమ్మని చెప్పారని అన్నారు. నిర్మాతల వైపు నుంచే ఆలస్యం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు కానీ సినీ పరిశ్రమతో సానుకూలంగా స్పందిన్స్తుందని అన్నారు.
నిర్మాతలు, సినీ పెద్దలందరూ కలిసి కూర్చుని టికెట్ రేట్లపై ఒక మాట మీద నిలబడి ఒక పద్దతి అంటూ తీసుకొస్తే సినిమా నిర్మాతలకు తికెట్ రేట్ల పెంపు కోసం ప్రతిసారీ ప్రభుత్వం చుటూ తిరిగే సమస్య తప్పుతుంది.