మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని పట్టించిన పుష్ప2 సినిమా

Allu Arjun in Pushpa 2 climax photo

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక నటించిన పుష్ప 2 సినిమా విడుదలై భారీ విజయం అందుకుంటూ పాత రికార్డులన్నీ బద్దలుకొడుతున్న విషయం మనకి తెలిసిందే, అయితే పుష్ప 2 సినిమా వల్ల ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పోలీసులకి దొరికాడు.

Allu Arjun in Pushpa 2 climax photo

విశాల్ మేశ్రం అనే గ్యాంగ్ స్టర్ ని పట్టుకోడానికి పోలీసులు 10 నెలలుగా గాలిస్తున్నారు. అయితే ఇతను చాలా తెలివిగా పోలీసులని తప్పించుకుంటూ గడిపేస్తున్నాడు. ఇతని మీద డ్రగ్స్ అక్రమ రవాణా, 2 హత్య కేసులతో కలిపి మొత్తం 27 కేసులు ఉన్నాయి. అయితే ఇతను పుష్ప2 సినిమా మీద ఆసక్తితో సినిమా చూడటానికి మహారాష్ట్ర లోని ఒక మల్టిప్లెక్స్ కి వస్తున్నాడనే పక్కా సమాచారం ఉండడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసారు. ఈ ఘటనతో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా సామాన్యులని ఎంతగా ఆకట్టున్నదో అనే విషయం తెలుస్తుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *