అల్లు అర్జున్ కి తెలంగాణా పోలీస్ నోటీసులు
అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు ఈ మధ్యనే షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ ని మంజూరు చేసింది. ఈ బెయిల్ షరతుల్లో ఒకటి ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో వ్యక్తిగత విచారణకు హాజరు కావడం. అయితే ఈరోజు ఉదయం తెలంగాణా పోలీసులు అల్లు అర్జున్ కి నోటీసులు జారీ చేసారు. ఎందుకో వివరంగా తెలుసుకుందాం.
సంధ్య థియేటర్ ఘటనలో మృతిచెందిన రేవతి కుమారుడు శ్రీతేజ ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకుంటున్నాడు. అతని ఆరోగ్యం ఈమధ్యనే మెరుగుపడటం మొదలైంది. ఇప్పుడు శ్రీతేజని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్ళాలని అల్లు అర్జున్ అనుకున్నాడు. ఇదే విషయాన్ని అల్లు అర్జున్ మేనేజర్ పోలీసు వారికి తెలియజేయగా, వారు దాని గురించి అతనికి నోటీసులు జారీ చేసారు.
ఈ నోటీసులో “మీ మేనేజర్ ద్వారా మాకు మీరు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న మైనర్ భాదితుడిని పరామర్శించాలని అనుకుంటున్నారని తెలిసింది. ఈ సంఘటన మీద ప్రజల్లో ఉన్న ఆసక్తి దృష్ట్యా మీరు ఈ పరామర్శ గురించి మరోసారి ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నాము. ఒకవేళ మీరు ఆలోచించిన తర్వాత కూడా వెళ్ళాలని అనుకుంటే మీ టీం ని రాం గోపాల్ పేట పోలీసులతో మీరు ఆసుపత్రికి వెళ్ళే వచ్చే విషయం గురించి ముందే తెలియజేసేవిధంగా సహకరించాలని విజ్ణప్తి చేస్తున్నాము. అదే విధంగా, ఆసుపత్రి దగ్గర జనాలు గుమ్మిగూడే అవకాశం లేకుండా మీరు ఆసుపత్రికి వెళ్ళి వచ్చే సమయం గురించ్చి గోప్యంగా ఉంచవల్సిందిగా తెలియజేస్తున్నాము.”
అదే విధంగా “ఈ విషయంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండ్దేందుకు మీ సంపూర్ణ సహకారం ఉంటుందని కోరుకుంటున్నాము. ఒకవేళ మీరు పైన తెలియబరిచిన విధంగా పాటించకుండా పరామర్శించేందుకు వెళ్తే అక్కడ జరిగే ఘటనలకు మిమ్మల్నే భాద్యులుగా పరిగణించాల్సి ఉంటుంద్ది” అని పేర్కొన్నారు.
అయితే పోలీసులు ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ శ్రీతేజ ని పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్తాడా లేదా అని వేచి చూడాలి. ఒక వేళ వెళ్ళినా పోలీసులు సూచించినట్లు గోప్యంగా వెళ్ళి పరామర్శించి వస్తారని అనిపిస్తుంది.