నెట్ ఫ్లిక్స్ పిటిషన్ ను కొట్టేసిన కోర్టు.

నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఒక డాక్యుమెంటరీ. ఇందులో నటి నయనతార, ఆమె భర్త దర్శకుడు విఘ్నేశ్ ల ప్రేమ నుంచి పెళ్ళి దాకా జరిగిన విషయాలని పొందుపరిచి రూపొందించి విడుదల చేసారు.
నయనతార విజయ్ సేతుపతితో కలిసి నేను రౌడీనే అనే చిత్రంలో నటించారు. నయనతార భర్త విఘ్నేశే ఈ చిత్ర దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరిస్తున్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ చిత్రాన్ని ధనుష్ నిర్మించారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో నయనతార, విఘ్నేశ్ వివాహం చేసుకున్నారు.
ఈ వివాహ వేడుకకు సంబంధించిన అన్నీ వీడియోలని ప్రసారం చేసే హక్కులని నెట్ ఫ్లిక్స్ సంపాదించుకుంది. దానిలో భాగంగా ఈ డాక్యుమెంటరీని 2024 నవంబర్ 18న నయనతార 40వ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసింది. ఈ డాక్యుమెంటరీలో తమ ప్రేమ చిగురించిన సినిమా నేనూ రౌడీనే లోని దృశ్యాలని కూడా పొందుపరిచారు. దీనిపై ఈ సినిమా నిర్మాత అయిన ధనుష్, తన అనుమతి లేకుండా తన సినిమాలోని దృశ్యాలని ఈ డాక్యుమెంటరీలో ఎలా పొందుపరుస్తారని కోర్టుకెక్కారు.
దీన్ని చాలెంజ్ చేస్తూ నెట్ ఫ్లిక్స్ సంస్థ కోర్టులో పిటీషన్ వేయగా, ఈరోజు నెట్ ఫ్లిక్స్ వేసిన పిటిషన్ ని కొట్టివేసింది. అయితే ధనుష్ కోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ కొనసాగుతుందా, లేదంటే ధనుష్ నెట్ ఫ్లిక్స్ రాజీ పడతారా అనే విషయం తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.