పరిశ్రమలో విషాదం, కబాలి నిర్మాత ఆత్మహత్య

Producer KP Chowdary

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నిర్మాత కె.పి చౌదరి ఒత్తిడిలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. కబాలి సినిమా నిర్మాతల్లో కె పి చౌదరి, పూర్తి పేరు సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి కూడా ఒకరు. ఈయన ఇంతకు ముందు కొన్ని తెలుగు సినిమాలని డిస్ట్రిబ్యూట్ కూడా చేసారు.

అయితే కబాలి సినిమా తర్వాత ఈయన మత్తుపదార్థాలు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు, పోలీసులు అతని దగ్గర సుమారు 82 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. సినీ పరిశ్రమలో నష్టం రావడంతో డ్రగ్స్ వ్యాపారంలోకి దిగిన ఈయన గోవా నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.

ఈ కేసు తర్వాత గోవాకి వెళ్ళి ఒక అక్కడ ఒక క్లబ్ ప్రారంభించి స్థిరపడాలని అనుకున్నాడు, అయితే అనుకున్నది అనుకున్నట్లు జరగక, మరికొన్ని వైఫల్యాలని తట్టుకోలేక ఆత్మహత్యకి పాల్బడ్డారు. డిల్లీ పోలీసులు ఈ విషయాన్ని విచారించి ఆత్మహత్య అని నిర్దారించి పాల్వంచలో ఉన్న అతని తల్లికి తెలియజేసారు.

Spread the love

Leave a Reply