2027 సంక్రాంతి కి మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం?
అనిల్ రావిపూడి పోయిన సంక్రాంతికి వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కొల్లగొట్టాడు. ఈ సంవత్సరం మళ్ళీ సంక్రాంతి కి ఏకంగా చిరంజీవితో మన శంకర వర ప్రసాద్ గారు సినిమాతో వచ్చాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. ముఖ్యంగా చిరంజీవి కామెడీ టైమింగ్ కి ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయి థియేటర్లలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 225 కోట్లు కలెక్ట్ చేసినట్లు ప్రొడక్షన్ హౌస్ పోస్టర్ రిలీజ్ చేసారు.
అయితే అనిల్ కి బాగా అచ్చొచ్చిన సంక్రాంతికి, రాబోయే సంవత్సరం ఎవరి సినిమాతో దిగుతాడా అనె చర్చలు మొదలయ్యాయి. అయితే, సంక్రంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అయి విజయవంతం అయిన తర్వాత జరిగిన ఇంటర్వ్యూల్లో, ప్రెస్ మీట్లలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సీక్వెల్ తీసే ఆలోచనలు ఉన్నాయని చెప్పాడు, పేరు కూడా మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పాడు.
మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి మొన్న మన శంకర వర ప్రసాద్ ప్రెస్ మీట్లలో కూడా కొంతమంది జర్నలిస్టులు ప్రస్తావించారు. దీంతో 2027 సంక్రాంతికి అనిల్ రావిపూడి మన సంక్రాంతికి వస్తున్నం సినిమాతో వస్తాడని అనుకున్నారు. అయితే, వెంకటేష్ ఇప్పటికే త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం సినిమా షూటింగ్ మొదలుపెట్టేసారు. పైగా ఈ సినిమా తరువాత వెంకటేష్ దృశ్యం 3 షూటింగ్ లో పాల్గొంటారని అనుకున్నారు. అయితే, ఇటీవల దృశ్యం 3 సినిమాని తెలుగుని ఆపేసినట్లు కథనాలు వచ్చాయి.
ఇప్పుడు ఈ కథనాలు నిజమే అయితే మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా 2027 సంక్రాంతికి వచ్చే అవకాశాలు లేకపోలేదు. అనిల్ రావిపూడి ఇప్పటికిప్పుడు అనుకున్నా సినిమా కథ రాసేసి, వెంకటేష్ కి చెప్పేసి, నచ్చితే త్రివిక్రం సినిమా షూటింగ్ పూర్తవగానే మొదలెట్టేసి మళ్ళీ సంక్రాంతికి సినిమా విడుదల చేసే సత్తా ఉన్న దర్శకుడు. అయితే తన తర్వాత సినిమా గురించి అనిల్ రావిపూడి అధికారకంగా ఎటువంటి ప్రకటనలు చేయలేదు, చూడాలి మరి.
