రామ్ చరణ్ తో త్రివిక్రమ్ సినిమా, అసలేం జరుగుతోంది ?

గ్లోబల్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా చిత్రీకరణలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే విడుదలైన పెద్ది ఫస్ట్ గ్లింప్స్ కి చాలా మంచి స్పందన వస్తుంది. దర్శకుడు బుచ్చిబాబు సినిమాని వేగంగా పూర్తి చేసి చెప్పినట్లుగా మార్చి 2026 లో విడుదల చేయాలని అనుకుంటున్నాడు. ఇది ఇలా ఉండగా రాం చరణ్ తర్వాత సినిమా ముందు చెప్పినట్లుగానే అందరూ సుకుమార్ తోనే అనుకున్నారు. అయితే పుష్ప విజయం తర్వాత సుకుమార్ సినిమా స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు, దాని వల్ల సినిమా మొదలవ్వడానికి మరికొంత సమయం పట్టడంతో, పెద్ది షూటింగ్ అయిపోగానే మరొక సినిమా చేసేందుకు రాం చరణ్ చాలా మంది యువ దర్శకుల దగ్గర నుంచి కథలు వింటున్నట్లు సమాచారం. దానిలో భాగంగానే రాం చరణ్ తమిళ దర్శకుడు వెట్రిమారన్ ని కూడా కలిసాడని వార్తాకథనాలు వచ్చాయి.
యువీ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మాత సంస్థల దగ్గర రాం చరన్ డేట్లు ఉన్నాయి. అదే విధయంగా యువీ క్రియేషన్స్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగకి అద్వాన్స్ ఇచ్చినట్లు కూడా సమాచారం. అప్పట్లో సందీప్ రెడ్డి వంగతో సినిమా అని కూడా వార్తలొచ్చాయి. బాలీవుడ్ యాక్షన్ సినిమా కిల్ దర్శకుడు నిఖిల్ నాగెష్ భట్ట్ కూడా రాం చరన్ కి కథ వినిపించారని ఒక మైథాలజికల్ థ్రిల్లెర్ సినిమా ఉండబోతుందని బాలీవుడ్ వార్తాపత్రికల్లో కథనాలొచ్చాయి.
అయితే వీటన్నింటికి భిన్నంగా ఇప్పుడు త్రివిక్రం శ్రీనివాస్ పెద్ది తర్వాత రాం చరన్ ఓ సినిమా తీయబోతున్నట్లు సమాచారం. మే మొదటి వారంలో త్రివిక్రం రాం చరణ్ ని కలిసి ఒక కథ చెప్పాడని, ఆ కథ నచ్చి పూర్తి స్క్రిప్ట్ తో తన వద్దకు రమ్మని రాం చరణ్ చెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రం శ్రీనివాస్ సంక్రాంతికి వస్తున్నాం హిట్ తర్వాత వెంకటేష్ తో ఒక మంచి ఎంటర్టైనర్ సినిమా తీస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత సెలవు మీద వెళ్ళిన వెంకటేష్ ఇటీవలే తిరిగి వచ్చారు, త్వరలోనే త్రివిక్రంతో సినిమా గురించి అధికారకంగా ప్రకటించి షూటింగ్ మొదలుబెట్టబోతున్నట్లు సమాచారం.
త్రివిక్రం శ్రీనివాస్ అల్లు అర్జున్ తో పుష్ప తర్వాత సినిమా తీయాల్సి ఉంది, అయితే మధ్యలో అట్లీ రావడం ఆ సినిమా చిత్రీకరణకి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండడంతో త్రివిక్రం వెంకటేష్ తో సినిమాని మొదలుబెట్టారు.
ఇప్పుడు తాజా కథనాల ప్రకారం వెంకటేష్ తో సినిమా అయిపోయాక త్రివిక్రం రాం చరణ తో సినిమా చేస్తారని అనుకోవచ్చు. అయితే ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుధ్ ని కాని, సాయి అభ్యంకర్ గాని తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం, సాధారణంగా త్రివిక్రం సినిమా అంటే థమనే సంగీత దర్శకుడిగా ఉంటారు. దానికి భిన్నంగా ప్రయత్నిద్దాం అని అనుకుంటున్నట్లు ఉన్నారు. వార్తా కథనాలు నిజమయితే ఈ సినిమా 2026 లో మొదలయ్యే అవకాశం ఉంది. అయితే నిర్మాణ సంస్థ కూడా కొత్త నిర్మాణ సంస్థ అని వార్తలు వినిపిస్తున్నాయి, వేచి చూడాలి, త్రివిక్రం ఎప్పటిలా సితార ఎంటర్టైన్మెంట్స్ తో కాకుండా కొత్త నిర్మాణ సంస్థ సారధ్యంలో సినిమా చేస్తారా లేదా అనేది.